పరిహారం చెల్లింపుల్లో జాప్యం తగదు

ABN , First Publish Date - 2022-12-15T00:47:32+05:30 IST

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీ ఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం చెల్లింపులో ప్రభుత్వ జాప్యం తగదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం బస్వాపూర్‌ కట్టపై నిర్వాసితులు చేపట్టిన దీక్ష లు 16వ రోజుకు చేరాయి.

పరిహారం చెల్లింపుల్లో జాప్యం తగదు

డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, డిసెంబరు14: బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీ ఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం చెల్లింపులో ప్రభుత్వ జాప్యం తగదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం బస్వాపూర్‌ కట్టపై నిర్వాసితులు చేపట్టిన దీక్ష లు 16వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీ ఎన్‌ తిమ్మాపూర్‌లో 1800 ఎకరాల భూమి ముంపున కు గురవుతుండగా, 600 మందికి మాత్రమే పరిహా రం అందించడం ఎంత వరకు సమంజసమన్నారు. 1056 అర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి గానూ కేవలం 600 ఇళ్ల కు మాత్రమే పరిహారం, పునరావాసం కల్పించడం సరికాదన్నారు. రూ.80కోట్లు విడుదల చేయాల్సి ఉండ గా, రూ.50కోట్లు మాత్రమే నిధులు విడుదల చేయ డం ఎంతవరకు సబబు అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌, ఎమ్మెల్యే స్పందించి నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ పిన్నం లత, ఎంపీటీసీ ఉడుత శారద, ఉప సర్పంచ్‌ ఎడ్ల దర్శన్‌రెడ్డి, నాయకులు తంగెలపళ్లి రవికుమార్‌, మల్లేశం, నందు, పెద్దస్వామి, కృష్ణ, వల్లందా సు ఆదినారాయణ, సత్యనారాయణ పాల్గొన్నారు.

బోరున విలపించిన మహిళలు

బస్వాపూర్‌ ప్రాజెక్టుతో భూములు, ఇళ్లు కోల్పోతు న్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే దిక్కులేని వారమవుతామని పలువురు మహిళలు బోరున విలపించారు. దీక్షల్లో పాల్గొన్న పలువురు మహిళలు తమ పరిస్థితిని అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులకు చెప్పుకొని విలపించారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-15T00:47:35+05:30 IST