ప్రచారానికి వెళ్లిన.. టీఆర్ఎస్ నాయకుడి మృతి
ABN , First Publish Date - 2022-10-17T09:39:30+05:30 IST
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ టీఆర్ఎస్ నాయకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మరణించాడు.
రామంతాపూర్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ టీఆర్ఎస్ నాయకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మరణించాడు. రామంతాపూర్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు జగదీ్షకుమార్(52) ఉప ఎన్నిక పనుల నిమిత్తం నాలుగు రోజుల క్రితం మునుగోడు, నారాయణపురం మండలంలోని పుట్టపాకకు వెళ్లారు. ఆదివారం ఓ భవనంపైకి వెళ్లిన ఆయన పక్కనే ఉన్న చెట్టు నుంచి సీతాఫలాలు తీసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన జగదీ్షను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. జగదీ్షకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.