ధనికులకే ‘దళితబంధు’ ములుగు జిల్లాలో నిరసన

ABN , First Publish Date - 2022-10-05T09:52:48+05:30 IST

దళితబంధు పథకంలో పారదర్శకత లోపించిందంటూ ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో మంగళవారం పలువురు దళితులు ధర్నా చేశారు.

ధనికులకే ‘దళితబంధు’ ములుగు జిల్లాలో నిరసన

వెంకటాపూర్‌(రామప్ప), అక్టోబరు 4: దళితబంధు పథకంలో పారదర్శకత లోపించిందంటూ ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో మంగళవారం పలువురు దళితులు ధర్నా చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత నేత బీరేళ్లి సమ్మయ్య మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో 15 మందిని దళితబంధు పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, వీరిలో అత్యధికులు ధనికులే ఉన్నారని ఆరోపించారు. ఒక్కొక్కరికి ఐదు నుంచి పదెకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిపారు. స్థానిక సర్పంచ్‌ కమీషన్ల కక్కుర్తితో అనర్హులను ఎంపిక చేశారని ఆరోపించారు. 

Updated Date - 2022-10-05T09:52:48+05:30 IST