గూగుల్‌కు సైబర్‌ క్రైం పోలీసుల నోటీసులు

ABN , First Publish Date - 2022-10-11T09:19:21+05:30 IST

ఫోన్‌ నంబర్ల సమాచారాన్ని ధ్రువీకరించుకోకుండా ఆన్‌లైన్‌లో ఉంచటంపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు గూగుల్‌ సంస్థకు నోటీసులు జారీచేశారు.

గూగుల్‌కు సైబర్‌ క్రైం పోలీసుల నోటీసులు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ నంబర్ల సమాచారాన్ని ధ్రువీకరించుకోకుండా ఆన్‌లైన్‌లో ఉంచటంపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు గూగుల్‌ సంస్థకు నోటీసులు జారీచేశారు. ఇటీవల ప్రముఖ కంపెనీల సర్వీస్‌ సెంటర్ల పేరుతో కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి, ఫోన్‌ నంబర్‌ను గూగుల్‌లో వచ్చేలా చేయడం ద్వారా నిందితులు మోసానికి పాల్పడ్డారు. ఇలాంటి కేసులు తరచుగా వెలుగులోకి వస్తుండటంతో... ఈ విషయంపై స్పందించాలని సైబర్‌ క్రైం పోలీసులు గూగుల్‌కు తెలిపారు.

Updated Date - 2022-10-11T09:19:21+05:30 IST