నేటి నుంచి ఏఎమ్మార్పీ కాల్వలకు సాగు నీరు

ABN , First Publish Date - 2022-12-31T23:45:45+05:30 IST

యాసంగి సీజన సాగుకు ఎలిమినేటివ్‌ మాధవరెడ్డి ప్రాజెక్ట్‌ (ఏఎమ్మార్పీ) పరిధిలోని హైలెవల్‌, లోలెవల్‌ కాల్వలకు ఆదివారం నుంచి సాగునీటిని విడుదలకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

 నేటి నుంచి ఏఎమ్మార్పీ కాల్వలకు సాగు నీరు

నేటి నుంచి ఏఎమ్మార్పీ కాల్వలకు సాగు నీరు

వారబందీ విధానంలో 120 రోజుల పాటు నీటి విడుదల

నల్లగొండ, డిసెంబరు 31: యాసంగి సీజన సాగుకు ఎలిమినేటివ్‌ మాధవరెడ్డి ప్రాజెక్ట్‌ (ఏఎమ్మార్పీ) పరిధిలోని హైలెవల్‌, లోలెవల్‌ కాల్వలకు ఆదివారం నుంచి సాగునీటిని విడుదలకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ ఇనచార్జి సీఈ వి.అజయ్‌కుమార్‌ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైలెవల్‌ కెనాల్‌తో పాటు లోలెవల్‌ కెనాల్‌కు 120 రోజుల పాటు ఈ నీటిని విడుదల చేయనున్నారు. ఈ రెండు కాల్వల పరిధిలో 2.85లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా వారబందీ విధానంలో డివిజన్ల వారిగా నీటి విడుదల చేయనున్నారు. హైలెవల్‌ కాల్వ పరిధిలో డీ-5 నుంచి డీ-55 వరకు డిస్టిబ్యూటర్లు ఉన్నాయి. నీటిపారుదలశాఖ 4, 5, 7 డివిజన్లుగా విభజించి ఈనెల 1 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు 120 రోజుల పాటు నీటి విడుదల చేయనున్నారు. ఒక వారం పాటు 4, 5 డివిజన్లకు, మరో వారం 7వ డివిజనకు ఇలా రొటేషన విధానంలో నీటిని విడుదల చేయనున్నారు. పుట్టగండి నుంచి నీటి విడుదల చేయనుండగా, పీఏపల్లి, పెద్దవూర, గుర్రంపోడు, కనగల్‌, నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి, కట్టంగూరు, నార్కట్‌పల్లి, నకిరేకల్‌, కేతేపల్లి మండలాలకు సాగునీరు అందనుంది. ఈ కాల్వలకు 1,050 నుంచి 1436 క్యూసెక్యుల చొప్పున నీటి విడుదల చేయనున్నారు. అదేవిధంగా తాగునీటి అవసరాల నిమిత్తం కాల్వ పరిధిలో ఉన్న చెరువులను కూడా నింపనున్నారు. లోలెవల్‌ కెనాల్‌ పరిధిలోని ఆరు మండలాలకు సాగు నీరు అందించనున్నారు. పెద్దవూర మండలంలోని పుల్యాతండా వద్ద పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, మాడ్గులపల్లి, దోమలపల్లి మండలాలకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఇనచార్జి సీఈ వి.అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, రైతులు నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు..

Updated Date - 2022-12-31T23:45:46+05:30 IST