రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-04-12T02:34:06+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. శ్రీరామనవమి సందర్భంగా

రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. శ్రీరామనవమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సోమవారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.  పెద్ద సంఖ్యలో భక్తులు  కోడెమొక్కు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా ఆలయ అధికారులు లఘుదర్శనం అమలు చేశారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు.

Updated Date - 2022-04-12T02:34:06+05:30 IST