Cpi Narayana: ఎంఎస్ఆరే.. కేవీపీకి వైఎస్ ఆత్మ అనే పేరు పెట్టింది
ABN , First Publish Date - 2022-08-31T04:14:06+05:30 IST
బీజేపీ కి తమకు విబేధాలు ఉంటాయని.. అయితే దత్తాత్రేయ అందుకు అతీతమని సీపీఐ నేత నారాయణ ..
హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (Bjp)కి తమకు విబేధాలు ఉంటాయని.. అయితే దత్తాత్రేయ అందుకు అతీతమని సీపీఐ నేత నారాయణ (Cpi Narayana) అన్నారు. దివంగత నేత ఎంఎస్ఆర్ (Msr)పై వామన రావు రాసిన పుస్తకాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Haryana Governor Bandaru Dattatreya) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ ఎంఎస్ఆర్తో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ (Congress)లో అప్పుడు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు. ఎంఎస్ఆర్ రాజకీయాల్లో బోలా శంకరుడని నారాయణ కొనియాడారు. కేవీపీ(Kvp)కి వైయస్ఆర్ (Ysr) ఆత్మ అనే పేరు పెట్టింది ఎంఎస్ఆరేనని చెప్పారు. ఎంఎస్ఆర్ అన్ని పార్టీలతో మితృత్వంగా ఉండేవారని నారాయణ పేర్కొన్నారు.