Laxman: సీఎంవో కనుసన్నల్లో మునుగోడు కౌంటింగ్
ABN , First Publish Date - 2022-11-06T13:27:05+05:30 IST
TS News: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ (BJP) ఎంపీ లక్ష్మణ్ (Laxman) టీఆర్‌ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో కౌంటింగ్ జరుగుతోందని ఆయన విమర్శించారు.
TS News: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ (BJP) ఎంపీ లక్ష్మణ్ (Laxman) టీఆర్‌ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో కౌంటింగ్ జరుగుతోందని ఆయన విమర్శించారు. మునుగోడు ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, మంత్రులు ఇన్‌చార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీకి ఆధిక్యత రావటం టీఆర్ఎస్‌కు చెంపపెట్టు అని పేర్కొన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నిస్తే తప్ప.. సీఈవో పనిచేయటం లేదని, ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సీఎంవో ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని విమర్శించారు. సీఎంవో నుంచి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. కుంటి సాకులు చెబుతూ టీఆర్ఎస్‌కు ఆధిక్యం వచ్చేదాకా కౌంటింగ్ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఐదో రౌండ్ ముగిసేవరకు నైతిక విజయం బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డిదేనని చెప్పారు.