కాంగ్రెస్‌, బీజేపీ నేతలు చేసిందేమిటీ?: Harish Rao

ABN , First Publish Date - 2022-05-28T02:43:34+05:30 IST

కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు 70 ఏళ్లు పాలించి

కాంగ్రెస్‌, బీజేపీ నేతలు చేసిందేమిటీ?: Harish Rao

మెదక్‌: కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు 70 ఏళ్లు పాలించి రాష్ట్రానికి చేసిందేమీలేదని విమర్శించారు. అలాంటిది తన ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ ఎన్నో అద్భుతాలు చేసి చూపించారని హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ అభివద్ధి కోసం ఒక్క మాటైనా చెప్పారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఐక్యత, అభివృద్ధిని చూసి ఓర్వలేక మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన మోదీ, అమిత్‌షాలు పేదల కోసం, అభివృద్ధి కోసం ఒక్కమాట కూడా చెప్పకున్నా, ప్రజలను మాత్రం రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని హరీశ్‌రావు  ధ్వజమెత్తారు. 

Updated Date - 2022-05-28T02:43:34+05:30 IST