మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-03-04T08:21:03+05:30 IST

కరీంనగర్‌ సిగలో కలికితురాయిగా నిలవనున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా త్వరలో శంకుస్థాపన చేయించనున్నటు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన

ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్‌ సమీక్ష 

 హైదరాబాద్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ సిగలో కలికితురాయిగా నిలవనున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా త్వరలో శంకుస్థాపన చేయించనున్నటు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి పర్యాటక, ఇరిగేషన్‌, రెవిన్యూ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు అవసరమైన పనులను రూ.408 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. పర్యాటక శాఖకు సంబంధించి డీపీఆర్‌ పూర్తయిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు.

Read more