వరంగల్‌ రెడ్‌ క్రాస్‌ను ప్రథమ స్థానంలో నిలపాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-03-05T05:51:59+05:30 IST

వరంగల్‌ రెడ్‌ క్రాస్‌ను ప్రథమ స్థానంలో నిలపాలి : కలెక్టర్‌

వరంగల్‌ రెడ్‌ క్రాస్‌ను ప్రథమ స్థానంలో నిలపాలి : కలెక్టర్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, మార్చి 4: జిల్లా రెడ్‌ క్రాస్‌ సంస్థను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోనే నిలిపేందుకు సభ్యులు కృషి చే యాలని కలెక్టర్‌ బి.గోపి కోరారు. శుక్రవారం రెడ్‌క్రాస్‌ సొసైటీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్‌ చాం బర్‌లో మేనేజింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమా వేశంలో ల్యాండ్‌ అలాట్‌మెంట్‌, ఎంజీఎం, జనరిక్‌ మెడికల్‌ షాపు, ఐఆర్‌సీఎస్‌, టెంపరి, ఎ కామినేష్‌, బ్లడ్‌ డునేషన్‌ క్యాం పులు, సీకేఎం ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకు మేనేజ్‌మెంట్‌, మెంబర్‌ షిప్‌ల మండల లేవల్‌ కమిటీలతో దత్తత గ్రామాలపై చర్చిం చారు. సొసైటీ సేవలు నిరుపేదల పాలిట వరంగా మారాయ ని, ప్రజాసేవే కర్తవ్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. సమావేశంలో జిల్లా చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, కోశాధికారి పోతాని రాజేశ్వర ప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ లెక్కల విద్య, సభ్యులు ఎన్‌.శాంతికుమార్‌, రాజేంద్రనాథ్‌, జి.రాజ్‌కుమార్‌, బండి సారంగపాణి, తోట రాము, బిల్ల రమణారెడ్డి పాల్గొన్నారు.

Read more