‘దళిత బంధు’ ఎంపిక వేగవంతం చేయండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-02-02T05:45:52+05:30 IST

‘దళిత బంధు’ ఎంపిక వేగవంతం చేయండి: కలెక్టర్‌

‘దళిత బంధు’ ఎంపిక వేగవంతం చేయండి: కలెక్టర్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1: దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రి యను వేగవంతం చేయాలని కలెక్టర్‌ బి.గోపి సంబంధిత అధికారులను ఆదే శించారు. మంగళవారం రివ్యూ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ నియోజ కవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక మార్చి 10లోపు పూర్తి కావాలన్నారు. ఇందుకోసం ఐదుగురు స్పెషల్‌ అధికారులను గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను నియమిస్తున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు బ్యాం కు అకౌంట్‌ త్వరగా ఏర్పాటు చేసేందుకు బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా ఐడీఎంను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్లు కె.శ్రీవత్స, బి.హరిసింగ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మాధవీలత, జడ్పీ సీఈవో రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-02T05:45:52+05:30 IST