ప్రతీ మొక్కను బతికించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-28T05:32:44+05:30 IST

ప్రతీ మొక్కను బతికించాలి : కలెక్టర్‌

ప్రతీ మొక్కను బతికించాలి : కలెక్టర్‌
మరియపురంలో నర్సరీని పరిశీలిస్తున్న కలెక్టర్‌

గీసుగొండ, జనవరి 27 : హరితహారం కింద నాటిన ప్రతీ మొక్కను బతికించాల ని కలెక్టర్‌ గోపి సూచించారు. మండలంలోని కొనాయిమాకుల, మరియపురం గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను, డంపింగ్‌ యార్డులు, బోర్‌ రీచార్జి పిట్‌ నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామస్థులకు కావలసి న మొక్కలను నర్సరీల్లో పెంచాలని సూచించారు. పశుపోషణ కోసం పశుగ్రాసం పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. కాగా మరియపురం గ్రామాభివృద్ధి గురించి సర్పంచ్‌ అల్లం బాల్‌రెడ్డి.. కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ హరిసింగ్‌, డీఆర్‌డీవో సంపత్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్‌ సుహా సిని, సర్పంచ్‌లు అల్లం బాల్‌రెడ్డి, డోలి రాధాచిన్ని, ఎంపీవో ప్రభాకర్‌రావు, ఏపీవో మోహన్‌రావు, కార్యదర్శి స్వప్న, ప్రియాంక పాల్గొన్నారు. కాగా గీసుగొండ, మ నుగొండ గ్రామాల్లో అభివృద్ధి పనులను డీఆర్‌డీవో సంపత్‌రావు పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దౌడు బాబు, నమిండ్ల రమరాజు, కార్యదర్శులు వేణు ప్రసాద్‌, సరిత పాల్గొన్నారు.

Read more