నేడు జగిత్యాలలో సీఎం కేసీఆర్‌ పర్యటన

ABN , First Publish Date - 2022-12-07T03:25:42+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 7వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.

నేడు జగిత్యాలలో సీఎం కేసీఆర్‌ పర్యటన

కలెక్టరేట్‌, తెలంగాణ భవనం ప్రారంభం

జగిత్యాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 7వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. జగిత్యాలలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనం, తెలంగాణ భవనం ప్రారంభోత్సవాలతో పాటు మెడికల్‌ కళాశాల భవన నిర్మాణానికి సీఎం భూమిపూజ చేయనున్నారు. అనంతరం జగిత్యాల పట్టణ శివారులోని మోతే మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ కవిత సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ పర్యటనకు అనుగుణంగా జగిత్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Updated Date - 2022-12-07T03:25:43+05:30 IST