విశ్వక్రీడా విజేతలకు సీఎం Kcr ఆతిథ్యం

ABN , First Publish Date - 2022-06-02T23:56:58+05:30 IST

విశ్వక్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్(nikhat zareen), షూటర్ ఇషా సింగ్( esha singh) లను రాష్ర్ర్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr)ప్రగతి భవన్ లో ఘనంగా సన్మానించి ఆతిథ్యం ఇచ్చారు.

విశ్వక్రీడా విజేతలకు సీఎం Kcr ఆతిథ్యం

హైదరాబాద్: విశ్వక్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్(nikhat zareen), షూటర్ ఇషా సింగ్( esha singh) లను రాష్ర్ర్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr)ప్రగతి భవన్ లో ఘనంగా సన్మానించి ఆతిథ్యం ఇచ్చారు. అంతకు ముందు పబ్లిక్ గార్డెన్ లోజరిగిన వేడుకల్లో ఘనంగా సన్మానించి, చెరో రూ.2కోట్ల రూపాయల నగదు బహుమతిని అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ వారిని, వారి తల్లిదండ్రులను ప్రగతి భవన్ కు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారితో కొద్ది సేపు ముచ్చటించారు. బాక్సింగ్ క్రీడపట్ల చిన్నతనం నుంచి మక్కువ చూపించడానికి గల కారణాలను, తాను గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమను నిఖత్ జరీన్ ను సీఎం అడిగి తెలుసుకున్నారు. స్వయంగా క్రీడాకారుడైన తన తండ్రి జమీల్ అహ్మద్ తనకు బాల్యం నుంచే అందించిన ప్రేరణ గురించి, ప్రోత్సాహం గురించి నిఖత్ సీఎంకు వివరించారు. 


తాను బాక్సింగ్ శిఓణ పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్ధిక సాయం తనలో ఎంతో ఆత్మస్థయిర్యాన్ని నింపిందని నిఖిత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా నిఖత్ జరీన్, ఇషాసింగ్ లను చూసి తెలంగాణ యువతీయువకులు స్పూర్తి పొందాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అదే సమయంలో జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణ పథకాన్ని సాధించిన ఇషాసింగ్ తో కూడా కేసీఆర్ ముచ్చటించారు. చిన్నతనంలోనే షూటింగ్ క్రీడలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఇషాను ముఖ్యమంత్రి అభినందించారు. తమ బిడ్డను గొప్ప క్రీడాకారిణిగా తీర్చిదిద్దిన ఇషా తల్లిదండ్రులను సీఎం అభినందించారు. దాదాపు గంట పాటు క్రీడాకారులు వారి కుటుంబ సభ్యులకు ప్రేమ పూర్వకంగా ఆతిధ్యమిచ్చి, ఘనంగా సన్మానించిన సీఎం కేసీఆర్, శోభ దంపతులు వారికి గౌరవ ప్రదమైన వీడ్కోలు పలికారు. 

Updated Date - 2022-06-02T23:56:58+05:30 IST