ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు: కొప్పుల
ABN , First Publish Date - 2022-12-16T03:17:24+05:30 IST
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఏటా మాదిరిగానే ఈసారీ క్రిస్మస్ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం ఆయన క్రిస్మస్ విందు ఏర్పాట్లపై
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఏటా మాదిరిగానే ఈసారీ క్రిస్మస్ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం ఆయన క్రిస్మస్ విందు ఏర్పాట్లపై సమీక్షించారు. ఎల్‌బీ స్టేడియంలో క్రిస్టియన్ల విందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, క్రైస్తవ మత ప్రముఖులు పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు కొత్త దుస్తులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవిస్తుందని చెప్పారు.