చైనా ఆక్రమణలకు అడ్డుకట్టవేయాలి: వీహెచ్
ABN , First Publish Date - 2022-12-16T03:32:50+05:30 IST
హైదరాబాద్, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): చైనా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయని పక్షంలో దేశానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ ఎంపీ వి.హన్మంత్‌రావు ఆవేదన వ్యక్తం
హైదరాబాద్, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): చైనా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయని పక్షంలో దేశానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ ఎంపీ వి.హన్మంత్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ చైనా భారత భూభాగాల ఆక్రమణలపై అంశంపై పార్లమెంట్‌లో మల్లిఖార్జున ఖర్గే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.