టీఆర్ఎస్ మాటలు కోటలు దాటాయి: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2022-03-08T00:53:03+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో టీఆర్ఎస్ మాటలు కోటలు

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో టీఆర్ఎస్ మాటలు కోటలు దాటాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ ప్రారంభం కావడం ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. ముందే ఒక పథకం ప్రకారం ప్రగతి భవన్ నుంచి రాసుకొచ్చిన పేర్లను అసెంబ్లీలో చదివారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈటల రాజేంద్ర ముఖం కేసీఆర్ చూడాల్సివస్తుందనే వారిని సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. బడ్జెట్ ప్రసంగం.. టీఆర్ఎస్ ప్రభుత్వ వీడ్కోల స్పీచ్లా ఉందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.