శతాధిక వృద్ధురాలు గూడెపు పుల్లమ్మ మృతి

ABN , First Publish Date - 2022-10-30T00:41:48+05:30 IST

హుజూర్‌నగర్‌, అక్టోబరు 29 : హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన శతాధిక వృద్ధురాలు, సీపీఐ నాయకురాలు గూడెపు పుల్లమ్మ(110) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. మూడురోజులుగా అనారోగ్యంతో పుల్లమ్మ ఇబ్బంది పడుతోంది. ఆమె మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. పుల్లమ్మకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గతంలోనే భర్త గోపయ్య చనిపోయారు. పుల్లమ్మ సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. పుల్లమ్మ మృతి పార్టీకి తీరనిలోటని పలువురు నాయకులు అన్నారు. ఆమె మృతదేహానికి సీపీఐ జిల్లా నాయకులు గుండు వెంకటేశ్వర్లు, పాలకూరి బాబు, యల్లావుల రాములు, జడ శ్రీనివాస్‌, ఇందిరాల వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

శతాధిక వృద్ధురాలు గూడెపు పుల్లమ్మ మృతి
పుల్లమ్మ(ఫైల్‌ఫొటో)

Updated Date - 2022-10-30T00:41:51+05:30 IST