అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుతో సంబరాలు

ABN , First Publish Date - 2022-03-05T07:13:47+05:30 IST

ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు

అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుతో సంబరాలు

  •  చంద్రబాబు, లోకే్‌షకు ఘనస్వాగతం


బంజారాహిల్స్‌/హైదర్‌నగర్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద శుక్రవారం టీటీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. విజయవాడ నుంచి నగరానికి వచ్చిన చంద్రబాబు, లోకే్‌షకు ఘన స్వాగతం పలికారు.  కాన్వాయ్‌ను డప్పు వాయిద్యాలతో తీసుకువచ్చారు. 


కార్యకర్తలతో బాబు కొద్ది సేపు ముచ్చటించారు. జూబ్లీహిల్స్‌ రోడ్లు సందడిగా మారాయి.  రైతుల పోరాటానికి ఫలితం దక్కిందని టీటీడీపీ యూత్‌ అధ్యక్షుడు పొగాకు జయరాం అన్నారు. టీడీపీ నాయకులు ఆరిఫ్‌, జీవీజీ నాయుడు, బాలాజీ గోస్వామి, నర్సింహ, ముజ్జు తదితరులు పాల్గొన్నారు. కాగా, నిజాంపేటలోని అమరావతి మద్దతుదారులు శుక్రవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. నిజాంపేట రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కేక్‌ కోసి స్వీట్లు పంచుకున్నారు. 


Updated Date - 2022-03-05T07:13:47+05:30 IST