Karimnagar: బస్సు వెళుతుండగా ఇలా టైర్ ఊడి పక్కన పడింది.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-09-10T22:58:54+05:30 IST

ఊటూరు క్రాస్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు రెండు శుక్ర వారం ఊడిపోయాయి. ఈ సమయంలో బస్సులో..

Karimnagar: బస్సు వెళుతుండగా ఇలా టైర్ ఊడి పక్కన పడింది.. చివరకు ఏమైందంటే..

ఊడిపోయిన బస్సు చక్రాలు.. తప్పిన ప్రమాదం

మానకొండూరు (కరీంనగర్ జిల్లా): మండలంలోని ఊటూరు క్రాస్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు రెండు శుక్ర వారం ఊడిపోయాయి. ఈ సమయంలో బస్సులో తొమ్మిది మంది ఉన్నారు. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సు నిలిపి వేశాడు. ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సు ఊటూరు నుంచి వేగురుపల్లి మీదుగా కరీంనగర్‌ వెళ్తుండగా ఘటన జరిగింది. రోడ్డు వెంట ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-09-10T22:58:54+05:30 IST