బీటెక్ విద్యార్థిని అదృశ్యం

ABN , First Publish Date - 2022-07-10T17:30:31+05:30 IST

బీటెక్ విద్యార్థి(B.Tech student)ని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలోని ఓ ప్రైవేటు కళాశాలలో

బీటెక్ విద్యార్థిని అదృశ్యం

Hyderabad: బీటెక్ విద్యార్థి(B.Tech student)ని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థిని వర్షిణి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వర్షిణినికి ఎగ్జామ్ ఉండటంతో సమీప బంధువు మోహన్రెడ్డి అనే వ్యక్తి యువతిని కాలేజీ వద్ద డ్రాప్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి తాను ఐడీకార్డ్ మర్చిపోయినట్టు గుర్తించిన యువతి.. కాలేజీ నుంచి తిరిగి ఇంటికి బయల్దేరింది. కానీ ఆమె ఇంటికి చేరలేదు. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించారు. ఎవరైనా తమ కూతురిని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వర్షిణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ముంబై కేంద్రంగా వినియోగించినట్టు అధికారులు గర్తించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విద్యార్థిని కోసం గాలిస్తున్నారు.

Read more