Warangalకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పంజాబ్లో ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-28T14:29:51+05:30 IST
జిల్లాలోని దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కన్నెబోయిన రాములు(32) పంజాబ్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కన్నెబోయిన రాములు(32) పంజాబ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకుని రాములు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జవాన్ మృతిపై కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారమిచ్చారు. కాగా... నెల క్రితమే భార్య పిల్లలను రాములు తనతో పాటు తీసుకెళ్లారు. అంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.