గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2022-12-16T01:29:10+05:30 IST
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండ లంలోని గుండ్లసింగారం గ్రామంలో వ్యవసాయ బావిలో బుధవారం గల్లంతైన ఎడవెల్లి గ్రామానికి చెందిన బయ్య దేవయ్య(47) మృతదేహం గురువారం బావిలో లభ్యమైంది.
నూతన్‌కల్ డిసెంబరు 15: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండ లంలోని గుండ్లసింగారం గ్రామంలో వ్యవసాయ బావిలో బుధవారం గల్లంతైన ఎడవెల్లి గ్రామానికి చెందిన బయ్య దేవయ్య(47) మృతదేహం గురువారం బావిలో లభ్యమైంది. మూడు మోటార్లతో నీటిని తోడి గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి తల్లి మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.