బోధన్‌ బంద్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2022-03-22T02:13:57+05:30 IST

బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సోమవారం నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.

బోధన్‌ బంద్‌ ప్రశాంతం

బోధన్‌: బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సోమవారం నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా తమ దుకాణ సముదాయాలను మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడే బీజేపీ, శివసేన, వీహెచ్‌పీ శ్రేణులను అడ్డుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్యను హౌస్‌ అరెస్టు చేశారు. అయితే శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం ఇంకా సద్దుమణగక పోవడంతో.. బోధన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అదనపు డీజీ నాగిరెడ్డి, హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ ఐజీ కమలహాసన్‌ రెడ్డి దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాతో పాటు కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన వందలాది పోలీసులను బోధన్‌లో మోహరించారు.

Updated Date - 2022-03-22T02:13:57+05:30 IST