తెలంగాణలోనూ బీజేపీదే విజయం: డీకే అరుణ

ABN , First Publish Date - 2022-03-12T00:55:14+05:30 IST

రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీదే విజయమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.

తెలంగాణలోనూ బీజేపీదే విజయం: డీకే అరుణ

తిరుమల: రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీదే విజయమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్న ఆమె ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్న మాటలకు ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపే సమాధానమన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ తన ప్రాభవాన్ని కొల్పోతున్న క్రమంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లి వివిధ రకాల వేషాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల కోసమే అనేలా కొన్ని పథకాలను ప్రవేశపెట్టడాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోతుందని మీడియా, పలు సర్వేలు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటూ నాలుగు రాష్ర్టాల్లో ఘన విజయాన్ని అందించారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని భావించిన ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ కోసం బీజేపీని గెలిపించారన్నారు. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని కావాలని, శత్రుదేశాలను ఎదుర్కొంటూ దేశాన్ని అభివృద్ధివైపునకు నడిపించాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు. బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మొక్కులు చెల్లించిన నేపథ్యంలో శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చానని అరుణ తెలిపారు.

Updated Date - 2022-03-12T00:55:14+05:30 IST