TS News: ‘ఓ సన్నాసి సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం’

ABN , First Publish Date - 2022-08-17T18:02:04+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

TS News: ‘ఓ సన్నాసి సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం’

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై బీజేపీ (BJP) సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ (A.chandrashekar)తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఒక సన్నాసి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ (Telangana) ప్రజల దౌర్భాగ్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు సిగ్గు, శరం లేదని తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజక్ట్ (Kaleshwaram project) కమిషన్ పైసలు కేసీఆర్ ఎక్కడ దాచాడో కేంద్రం దగ్గర సమాచారం ఉందన్నారు. వికారాబాద్ ప్రాంతానికి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కేసీఆర్ అమలు చేయలేదని తెలిపారు. ఏపీ సీఎం నీళ్ళు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వలనే దక్షిణ తెలంగాణ ఏడాదిగా మారిందని ఆయన వ్యాఖ్యలు చేశారు.


ఉచిత ఎరువులు ఇవ్వటానికే పుట్టానన్న కేసీఆర్.. రైతులను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే ఉద్యమం చేస్తే.. తెలంగాణ రాలేదన్నారు. ఉద్యమ దొంగలను పక్కన పెట్టుకుని కేసీఆర్ రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అనటానికి కేసీఆర్ కు సిగ్గుపడాలన్నారు. ఇళ్ళ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ కుటుంబం దాచుకుందని అన్నారు. తాగి ఫాంహౌస్‌లో పడుకునే కేసీఆర్‌కు కేంద్ర పథకాలు గుర్తు లేవన్నారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ చేస్తోన్న దాడులకు ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ముఖం చూపించే ధైర్యం‌ లేకనే కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళలేదన్నారు. కాళేశ్వరం ప్రాజక్టుతో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఏ.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. 

Read more