జాతీయ సమావేశాలపై రేపు బీజేపీ సమీక్ష

ABN , First Publish Date - 2022-06-07T09:15:14+05:30 IST

జాతీయ సమావేశాలపై రేపు బీజేపీ సమీక్ష

జాతీయ సమావేశాలపై రేపు బీజేపీ సమీక్ష

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 2, 3 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను బీజేపీ ముఖ్యనేతలు బుధవారం సమీక్షించనున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద్‌, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌లు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో సమావేశం కానున్నారు. సమావేశాల నిర్వహణకు సంబంధించి 16 మంది సీనియర్‌ నేతలతో ప్రత్యేక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. 35 విభాగాలతో వీరు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయనున్నారు.

Read more