బండి సంజయ్‌ను భేషరతుగా విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-01-04T05:19:59+05:30 IST

బండి సంజయ్‌ను భేషరతుగా విడుదల చేయాలి

బండి సంజయ్‌ను భేషరతుగా విడుదల చేయాలి
వరంగల్‌లోని పార్టీ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలు

బీజేపీ  జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ 


సంగెం, జనవరి 3: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడం సరికాదని, ఆయనను వెంటనే విడుదల చేయాలని  జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వరంగల్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలను శ్రీధర్‌ ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఉద్యోగుల కోసం సంజయ్‌ చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేయించడంతో పాటు ఆయన్ను అరెస్టు చే యడం పౌర హక్కులకు విఘాతం కలిపించడమేనని అన్నారు. సంజయ్‌ని వెంటనే విడుదల చేయా లన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరిశంకర్‌, రత్నం, కనుకుంట్ల రంజీత్‌,  చింతాకుల సునీల్‌, అనిల్‌, కుసుమ సతీష్‌, గంట రవికుమార్‌, పిట్టల కిరణ్‌, బండి సాంబయ్యయాదవ్‌ పాల్గొన్నారు.

Read more