రాష్ట్రంలో బీజేపీకి అధికారం పగటి కల : చిన్నారెడ్డి

ABN , First Publish Date - 2022-08-04T10:30:43+05:30 IST

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పగటి కల అని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.

రాష్ట్రంలో బీజేపీకి అధికారం పగటి కల : చిన్నారెడ్డి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పగటి కల అని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో పెడతామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గాంధీభవన్‌లో చిన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. అవినీతి చేసిన వారిపై సీబీఐతో ఎంక్వైరీ చేయిస్తేనే ప్రజలు నమ్ముతారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండు తోడుదొంగలే..! అని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి రాజగోపాల్‌ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, ఆయన బీజేపీకి ఎందుకు వెళ్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. 

Updated Date - 2022-08-04T10:30:43+05:30 IST