T.news: సీఎం కేసీఆర్‌కు ఛాలెంజ్ చేసి చెపుతున్నా..: రాజాసింగ్
ABN , First Publish Date - 2022-07-21T19:21:45+05:30 IST
‘‘మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణలో రాబోతున్నాయి... సీఎం కేసీఆర్‌కు ఛాలెంజ్ చేసి చెపుతున్నా’’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు.

నిజామాబాద్ : ‘‘మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణ(Telangana)లో రాబోతున్నాయి... సీఎం కేసీఆర్(KCR)కు ఛాలెంజ్ చేసి చెపుతున్నా’’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) వ్యాఖ్యలు చేశారు. గురువారం బోధన్ మండలం నర్సాపూర్‌లో ప్రజల గోస- బీజేపీ భరోసా బైక్ యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మంత్రులు, ఎమ్మెల్యేలలో తమ పదవులపై నమ్మకం లేదని, ఎప్పుడు ఊడుతుందో తెలియని భయంతో ఉన్నారని తెలిపారు. రెండేళ్లలో వరద సాయం కోసం ఇచ్చిన ఐదు వందల కోట్లను ఎక్కడ ఖర్చు చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్(TRS) కార్యకర్తల కోసమే వరద సాయం అడుగుతున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ(GHMC)లో రూ.10 వేలు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళే పంచుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ(Modi)ని చూస్తే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. జీఎస్టీ అంశాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాజాసింగ్ అన్నారు.