అమిత్ షా‎ను కలిసిన ఈటల రాజేందర్.. ఏం చర్చించారంటే..!

ABN , First Publish Date - 2022-06-20T03:53:18+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah)ను హుజూరాబాద్ (Huzurabad) బీజేపీ (Bjp) ఎమ్మెల్యే (Mla) ఈటల రాజేందర్ (Etela Rajendar) కలిశారు. తెలంగాణ...

అమిత్ షా‎ను కలిసిన ఈటల రాజేందర్.. ఏం చర్చించారంటే..!

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్ షా (Amith Shah)ను హుజూరాబాద్ (Huzurabad) బీజేపీ (Bjp) ఎమ్మెల్యే (Mla) ఈటల రాజేందర్ (Etala Rajendar) కలిశారు. తెలంగాణ (Telangana)లోని తాజా పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి కూడా అమిత్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో నిరంకుశ పాలన నడుస్తోందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో పర్యటించాలని అమిత్ షాను ఈటల రాజేందర్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించారని.. తెలంగాణకు సమయం కేటాయిస్తానని ఈటలకు చెప్పినట్లు సమాచారం.  తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా ఈటలకు అమిత్ షా సూచించారు. పార్టీ నేతలు కష్టపడి పని చేయాలని ఈటలకు తెలిపారు.  హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా అమిత్‌షాను ఈటల కలవడం చర్చనీయాంశంగా మారింది. 


జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సమయంలో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో ఈసారి గెలిచేది తామే అన్న ధీమాను బీజేపీ శ్రేణుల్లోకి  పంపాలని భావిస్తున్నారు. సభకు భారీగా జన సేకరణకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లా, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు అగ్నిపథ్‎ అల్లర్లపైనా అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. సికింద్రాబాద్ ఘటనపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాదిగా యువకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‎కు చేరుకుని బీభత్సం సృష్టిస్తుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల నుంచి వివరాలు తీసుకోవాలని నిర్ణయించారు. 


ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షాను ఈటల రాజేందర్ కలవడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. గతంలో ఈటల రాజేందర్‎పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాలు కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ అగ్రనేతలు.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు వివిధ కార్యక్రమాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‎లో జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ (Pm Modi), కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp Nadda)తో పాటు 300 మందికి పైగా బీజేపీ నేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సమయత్తమవుతున్నారు. హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరుగుతున్న ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ (Bandi Sanjay), ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్ (Raja Singh), రఘునందన్ రావు (Raghunandan Rao)తో పాటు డీకే అరుణ (Dk Aruna), విజయశాంతి (Vijayashanti), తదితర నేతలు.. హైదరాబాద్ వచ్చే బీజేపీ నేతలకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-20T03:53:18+05:30 IST