ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి కమలనాథులు

ABN , First Publish Date - 2022-07-07T14:42:57+05:30 IST

ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి కమలనాథులు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు..

ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి కమలనాథులు

Hyderabad : ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రజల్లోకి కమలనాథులు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు బీజేపీ కార్యాలయంలో ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ(TRS Government) వైఫల్యాలపై బీజేపీ(BJP) అధ్యయన కమిటీ సమావేశం నిర్వహించనుంది. ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ అధ్యయన‌ కమిటీ కన్వీనర్‌గా ఎంపీ‌ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) ఉన్నారు. కమిటీ నిర్వహించనున్న సమావేశానికి కమిటీ సభ్యులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేలా బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. కేసీఆర్ సర్కార్ ఎన్నికల హామీలను విస్మరించిందని కమలనాథులు చెబుతున్నారు.

Read more