మున్నూరు రవితో పరిచయం ఉంది: జితేందర్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-03-05T23:34:37+05:30 IST
మున్నూరు రవితో తనకు మొదటి నుంచి పరిచయం ఉందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ..
హైదరాబాద్: మున్నూరు రవితో తనకు మొదటి నుంచి పరిచయం ఉందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మున్నూరు రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. అయితే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వద్ద మున్నూరు రవి పీఏగా పని చేశారు. ఇప్పుడు ఈ కేసు అంశంపై జితేందర్ రెడ్డి స్పందించారు