Dk Aruna comments: కుర్చీ యావ తప్ప..‌ అయ్యా, కొడుకులకు వేరే ధ్యాస లేదు

ABN , First Publish Date - 2022-08-17T19:45:47+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయాలు తప్ప.. అభివృద్ధిపై ధ్యాస లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు.

Dk Aruna comments: కుర్చీ యావ తప్ప..‌ అయ్యా, కొడుకులకు వేరే ధ్యాస లేదు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు రాజకీయాలు తప్ప.. అభివృద్ధిపై ధ్యాస లేదని బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్రాన్ని విమర్శించే ముందు ఎనిదేళ్ళల్లో తెలంగాణ (Telangana)కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన మోసాలకు తెలంగాణ ప్రజలు (Telangana people) గద్దె దించాలని చూస్తున్నారన్నారు. కుర్చీ కాపాడుకునే యావ తప్ప..‌ అయ్యా, కొడుకులకు వేరే ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు ప్రధాని మోదీ (PM modi) మిత్రుడు.. ఇప్పుడు శత్రువు ఎలా అయ్యారని నిలదీశారు. తమరు చేసే దోపిడీకి అడ్డు చెప్పకుంటే మిత్రుడు.. లేదంటే శత్రువా? అని అరుణ (BJP Leader) మండిపడ్డారు.


కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్నీ తమరే పూర్తిచేశారా అని అడిగారు. కాళేశ్వరం మాదిరి.. పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం (Kaleshwaram project)తో కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చావా అంటూ ప్రశ్నలు కురించారు. ప్రాజక్టుల పేరుతో లక్షల కోట్లు కమీషన్లు  కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల అవినీతి బాగోతం రాస్తే పెద్ద పుస్తకం అవుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో జగన్‌ (CM Jagan)తో  కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఏపీ నిర్మించిన సంగమేశ్వరకు అడ్డు చెప్పని కేంద్రం.. పాలమూరు రంగారెడ్డికే కేంద్రం అడ్డు చెప్పిందా అని అన్నారు. జగన్‌కు కేసీఆర్ అమ్ముడుపోయారని డీకే అరుణ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-08-17T19:45:47+05:30 IST