బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ మెట్రో ప్రయాణం
ABN , First Publish Date - 2022-03-04T18:45:43+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. శుక్రవారం గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్‌కు మెట్రోలో బండి సంజయ్ బయల్దేరారు. పార్టీ అధ్యక్షుడితో పాటు స్వామిగౌడ్, ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి మెట్రోలో ప్రయాణం చేశారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పఠాన్ చెరువు నందీశ్వర్ గౌడ్ నివాసానికి బీజేపీ నేతలు వెళ్లనున్నారు.