Bandi sanjay: ఫోటో గ్రాఫర్ల సేవలు వెలకట్టలేనివి
ABN , First Publish Date - 2022-08-19T17:33:22+05:30 IST
సమాజంలో ఫొటో గ్రాఫర్ల సేవలు వెలకట్టలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.

జనగామ: సమాజంలో ఫొటో గ్రాఫర్ల సేవలు వెలకట్టలేనివని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం (Photography Day) సందర్భగా చీటకోడూరు సమీపంలోని ప్రజాసంగ్రామ యాత్ర శిబిరం వద్ద ఫోటో గ్రాఫర్లను బీజేపీ చీఫ్ (BJP Chief) సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కరోనా సమయంలో వారి సేవలను మాటల్లో వర్ణించలేనని తెలిపారు. క్రిమినల్స్‌ను పట్టుకోవడంలోనూ... ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటో తోటే సాధ్యమన్నారు. ఈ ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఫోటోగ్రాఫర్లకు, కెమెరామెన్లకు అక్రిడిటేషన్ కార్డులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.