Bandi sanjayకు భద్రత పెంపు

ABN , First Publish Date - 2022-06-21T18:54:51+05:30 IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పోలీసులు భద్రతను పెంచారు.

Bandi sanjayకు భద్రత పెంపు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi sanjay)కు పోలీసులు భద్రతను పెంచారు. బండి సంజయ్‌కు 1+5తో రోప్‌ పార్టీ ఏర్పాటు చేశారు. అదనంగా ఎస్కార్ట్‌ వాహనాన్ని పోలీసులు కేటాయించారు. హైదరాబాద్‌ పరిధిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలతో బండి సంజయ్‌కు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం అగ్నిపథ్‌‌లాంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-06-21T18:54:51+05:30 IST