మెడికల్‌ సీటిప్పిస్తానని మోసం చేసిన బీజేపీ నేత అరెస్టు

ABN , First Publish Date - 2022-09-21T14:21:57+05:30 IST

మెడికల్‌ సీటు ఇప్పిస్తానంటూ బీజేపీకి చెందిన కొత్తపల్లి సతీ్‌షకుమార్‌ రూ. 48.53 లక్షలు కాజేశాడు. సీటు ఇప్పించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధిత వ్యక్తి సీసీఎస్‌

మెడికల్‌ సీటిప్పిస్తానని మోసం చేసిన బీజేపీ నేత అరెస్టు

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌: మెడికల్‌ సీటు ఇప్పిస్తానంటూ బీజేపీకి చెందిన కొత్తపల్లి సతీ్‌షకుమార్‌ రూ. 48.53 లక్షలు కాజేశాడు. సీటు ఇప్పించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధిత వ్యక్తి సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సతీ్‌షకుమార్‌ను అరెస్టు చేశారు. జనగామ జిల్లాకు చెందిన బీజేపీ నేత కొత్తపల్లి సతీ్‌షకుమార్‌ మెడికల్‌ సీటు ఇప్పిస్తానని చెప్పి.. ఓ వ్యక్తి నుంచి రూ. 48.53 లక్షలు వసూలు చేశాడు. సీటు రాకపోవడం, సతీ్‌షకుమార్‌ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు సీసీఎస్‌ ఈస్ట్‌జోన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సతీశ్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరు పరిచారు. 

Read more