చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది: సీతారాం ఏచూరి

ABN , First Publish Date - 2022-09-19T09:17:47+05:30 IST

చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.

చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది: సీతారాం ఏచూరి

హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. 1948 ఫిబ్రవరి 4నుంచి 1949 జులై 11 వరకు అప్పటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌.. ఆర్‌ఎ్‌సఎ్‌సపై నిషేధం విధించారు. ఇప్పుడు వల్లభాయ్‌ పటేల్‌.. తమ సొంత మనిషి అన్నట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటోందని.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ, హిందూ-ముస్లిం ఘర్షణగా మార్చి ప్రజల్లో మతోన్మాద బీజం నాటే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.

Read more