హెచ్ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం
ABN , First Publish Date - 2022-06-27T21:16:38+05:30 IST
భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలకు సంబంధించిన కార్యాచరణలో భాగంగా హెచ్ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది

హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలకు సంబంధించిన కార్యాచరణలో భాగంగా హెచ్ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.అన్ని శాఖల అధికారులతోబీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్, శివకుమార్ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు.జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో పలువురు నాయకులు అధికారులతో భేటీఅయి ఏర్పాట్లపై చర్చించారు. సమావేశాల సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.