చిల్లర పార్టీ BJP: కేటీఆర్

ABN , First Publish Date - 2022-05-15T22:20:35+05:30 IST

కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) ప్రసంగంపై మంత్రి కేటీఆర్ (KTR) కౌంటరిచ్చారు.

చిల్లర పార్టీ BJP: కేటీఆర్

హైదరాబాద్: కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) ప్రసంగంపై మంత్రి కేటీఆర్ (KTR) కౌంటరిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు విశ్వసించరని తెలిపారు. అమిత్‌షా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పదవులు అమ్ముకునే చిల్లర పార్టీ బీజేపీ (BJP) అని ధ్వజమెత్తారు. నిజాంను వారి వారసులకంటే.. బీజేపీ నేతలే ఎక్కువ తలుచుకుంటున్నారని విమర్శించారు. బాధ్యత గల కేంద్రంమంత్రి ఇన్ని అబద్ధాలు ఆడతారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలో ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చిన డబ్బుతో బీజేపీ రాష్ట్రాలు బతుకుతున్నాయని తెలిపారు. అప్పులు బీజేపీ వాళ్లు చేస్తూ.. తమను నిందిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం 60 ఏళ్లల్లో చేసిన అప్పులను ప్రధాని మోదీ 8 ఏళ్లల్లో చేశారని వెల్లడించారు. మిషన్ భగీరథకు రూ.25వేల కోట్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ (NITI Aayog) చెప్పినా.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తాము అప్పుచేసి కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ చేశామని తెలిపారు. పెట్రోల్ రేట్లు పెంచి ప్రజల నుంచి రూ.26లక్షల కోట్లు వసూలు చేశారని విమర్శించారు. బీజేపీ ఆటల ఇక ఎన్నో రోజులు సాగవని కేటీఆర్ హెచ్చరించారు.

Updated Date - 2022-05-15T22:20:35+05:30 IST