Bhadracharam: 44.60 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
ABN , First Publish Date - 2022-08-10T00:59:00+05:30 IST
ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి (Godavari)కి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది...

భద్రాచలం (Bhadracharam): ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి (Godavari)కి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 44.60 అడుగులకు చేరింది. ఈ మేరకు అధికారులు భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర సీత వాగు పొంగడంతో నార చీరల ప్రాంతం, సీతమ్మ తల్లి విగ్రహం నీట మునిగింది.