విజయలక్ష్మి అలంకారంలో లక్ష్మీ తాయారు అమ్మవారు

ABN , First Publish Date - 2022-10-01T13:56:32+05:30 IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

విజయలక్ష్మి అలంకారంలో లక్ష్మీ తాయారు అమ్మవారు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 6వ రోజైన నేడు విజయ లక్ష్మి అలంకారంలో  లక్ష్మీ తాయారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఉదయం 8 గంటలకు (మూలమూర్తికి) అమ్మవారికి పంచామృతాలతో విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు భక్తులకు అమ్మవారి అలంకార దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సామూహిక కుంకుమ అర్చనలు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహించనున్నారు. రేపు  ఐశ్వర్య లక్ష్మీ అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 

Read more