అంగన్‌వాడీల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు!

ABN , First Publish Date - 2022-01-07T09:03:57+05:30 IST

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌కు లైన్‌క్లియర్‌ అయింది. 60 ఏళ్లకు పైబడిన వారికి రిటైర్మెంట్‌ ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు..

అంగన్‌వాడీల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు!

సంక్రాంతి తర్వాత ఉత్తర్వులు


హైదరాబాద్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌కు లైన్‌క్లియర్‌ అయింది. 60 ఏళ్లకు పైబడిన వారికి రిటైర్మెంట్‌ ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌గా రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ప్రభుత్వ ఆమో దం అనంతరం సంక్రాంతి తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రిటైర్మెంట్‌ తర్వాత ఎలాంటి ఆర్థిక సహకారం అందకపోవడంతో 60 ఏళ్లు పైబడిన వారు కూడా అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్నారు. వయోభారం వల్ల పనిచేయలేకపోతున్న వారికి రిటైర్మెంట్‌ ఇచ్చి.. వారికి ఆర్థిక సహకారం అందించాలన్న డిమాండ్‌ అంగన్‌వాడీల నుంచి దీర్ఘకాలంగా ఉంది.


1975లో ఏర్పాటైన అంగన్‌వాడీ వ్యవస్థలో అప్పట్లో 7వ తరగతి అర్హత ఉన్న వారిని అంగన్‌వాడీ టీచర్లుగా నియమించారు. విధులు నిర్వహిస్తూనే కొందరు పదో తరగతి పూర్తి చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్ని సాంకేతికతతో అనుసంధానం చేస్తున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో ఉన్న వారితో నెట్టుకు రావడం కష్టంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 31,711 అంగన్‌వాడీ కేంద్రాలు, 3989 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 67,411 మంది టీచర్లు, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 20% మంది వయోభారం, ఆరోగ్య సమస్యలతో రిటైర్‌ అయ్యే అవకాశం ఉంది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించడం ద్వారా ఇంగ్లీష్‌ మీడియం బోధన, డిజిటల్‌ తరగతులు, ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా అంగన్‌వాడీ టీచర్ల నియామకానికి ఇంటర్‌ విద్యార్హతగా ఉంది. 

Updated Date - 2022-01-07T09:03:57+05:30 IST