ముందస్తు ఎన్నికలకు సన్నద్ధంగా ఉండండి

ABN , First Publish Date - 2022-03-05T06:43:47+05:30 IST

‘‘టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సారధ్యంలో రాష్ట్రంలో ముందస్తు

ముందస్తు ఎన్నికలకు సన్నద్ధంగా ఉండండి

 కార్యకర్తలకు పిలుపునిచ్చిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అబ్రహాం  


అయిజ, మార్చి 4: ‘‘టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సారధ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు పోతాం.. సన్నద్ధంగా ఉండండి’’ అని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అబ్రహాం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాలోని అయిజ నుంచి రాజాపూర్‌ గ్రామం వరకు రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకైతే పోతామన్న నమ్మకం అందరికీ వచ్చేసిందని, కేంద్రంలో చక్రం తిప్పే ఉద్దేశంతో కేసీఆర్‌ అనుకూలంగా ఉన్నవారందరినీ కలుస్తున్నట్లు తెలిపారు. 


Read more