Bathukamma: తెలంగాణలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-26T00:54:27+05:30 IST

తెలంగాణలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగనున్నాయి.

Bathukamma: తెలంగాణలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

హైదరాబాద్: తెలంగాణలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగనున్నాయి. తొమ్మిది రోజులపాటు మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఆదివారం ఎంగిలిపూలతో ప్రారంభమైంది. పండగను పురస్కరించుకుని గుడిమల్కాపూర్‌  మార్కెట్‌కు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ రకాల పూలు వెల్లువెత్తాయి. యువతులు, మహిళలు తంగేడు, గునుగు, గులాబీ తదితర పూలను కొనుగోలు చేశారు. పూలపండుగలో పెద్దఎత్తున మహిళలు పాల్గొంటారు. బతుకమ్మ ఆటపాటలతో పలు ప్రాంతాలు సందడిగా మారాయి. తీరొక్క పువ్వును తీసుకొచ్చి అందంగా బతుకమ్మ పేర్చి ఆడపడచులు ఆడిపాడే వేడుక ఇది. ఎంగిలిపూలతో మొదలయ్యే బతుకమ్మ సంబురం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తోంది. చివరి రోజు అక్టోబర్‌ 3న ట్యాంక్‌బండ్‌ (Tankbund) దగ్గర ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. 


యువతులు, ముత్తైదువులు ఆడుతూ పాడుతూ చూప రులను అలరించే అరుదైన పండుగ బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొర్లే సమయంలో బతుకమ్మ పండగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారు. ఈ సంబురాలను భాద్రపద అమావాస్యం నుంచి తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఆడపడుచులు సిద్ధమవుతున్నారు. ఏటా దసరా నవరాత్రుల సమయంలోనే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఒక్కో రోజు ఒక్కో రూపంలో బతుకమ్మను పేరుస్తారు. గునుగు, తంగేడు, వివిధ రకాల పుష్పాలతో బతుక మ్మను పేర్చి పూజి స్తారు. పెద్దలు, పిల్లలు అందరూ ఒకచోట చేరి.. బతు కమ్మ పాటలు పాడి.. పూజలు చేస్తారు. వాయునాల్లో బెల్లం, సజ్జలు, పప్పు ధాన్యాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు. ఇలా చిరుధాన్యాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని ఈ పండగ తెలియజేస్తుంది. 

Read more