ఏడవ రోజుకు Basara IIIT విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-20T13:24:58+05:30 IST

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన ఏడో రోజుకు చేరింది. మెయిన్ గేటు వద్ద విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

ఏడవ రోజుకు Basara IIIT విద్యార్థుల ఆందోళన

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) విద్యార్థుల ఆందోళన ఏడవ రోజుకు చేరింది. మెయిన్ గేటు వద్ద విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కాగా విద్యార్థులతో గత అర్ధరాత్రి కలెక్టర్ జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆందోళన విరమించాలని కలెక్టర్ సూచించారు. అయితే లిఖిత పూర్వక హామీ కావాలని విద్యార్థులు పట్టు బట్టారు. విద్యార్థులు వినకపోవడంతో కలెక్టర్ వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు యధావిధిగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2022-06-20T13:24:58+05:30 IST