దేవరుప్పుల నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-15T15:25:03+05:30 IST

జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ఉదయం ప్రారంభమైంది.

దేవరుప్పుల నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

జనగామ: జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangram Yatra) సోమవారం ఉదయం ప్రారంభమైంది. బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రశాంతి హై స్కూల్లో జాతీయ జెండాను  బండి సంజయ్ ఎగుర వేశారు. ఇవాళ బొడతండా, దేవరుప్పుల తండా, ధర్మపురం, మైలారం,గ్రామాల మీదుగా యాత్ర కొనసాగనుంది. సాయంత్రానికి బండి సంజయ్ విస్నూర్ గ్రామానికి చేరుకొని దుర్గమ్మ తల్లిని దర్శించుకుని రాత్రికి ఇక్కడే బస చేయనున్నారు. 

Updated Date - 2022-08-15T15:25:03+05:30 IST