ఇంటి పోరును భరించలేకనే.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల పాట: సంజయ్‌

ABN , First Publish Date - 2022-02-23T09:18:40+05:30 IST

తన కొడుకు కేటీఆర్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టాలనే కుటుంబ ఒత్తిళ్లు భరించలేకనే..

ఇంటి పోరును భరించలేకనే.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల పాట: సంజయ్‌

సుల్తానాబాద్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 22: తన కొడుకు కేటీఆర్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టాలనే కుటుంబ ఒత్తిళ్లు భరించలేకనే సీఎం కేసీఆర్‌ ఒత్తిడిలోకి వెళ్లాడని, ప్రజల దృష్టిని మళ్లించడానికి జాతీయ రాజకీయాల పాట ఎత్తుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని ఇంట్లో టీవీలు, డైనింగ్‌ టేబుళ్లు పగులగొడుతున్నారని, దీంతో కేసీఆర్‌ ఏం చేస్తున్నాడో.. ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. 

Read more